ఎరువుల బ్లాక్ మార్కెట్ పై మాజీ మంత్రి, జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోట నరసింహం ఆదేశాల మేరకు నియోజకవర్గ వైసిపి నాయకులు జగ్గంపేట స్థానిక వైయస్సార్ పార్టీ కార్యాలయంలో అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరణ సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో యూరియా కోసం, ఎరువుల కోసం రైతులు గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కూటమి ప్రభుత్వం నిద్రపోతోంది ఆ సమస్యలను రైతులతో కలిసి అధికారులు దృష్టికి తీసుకెళ్లాలని ఆర్డీవోకి వినతి పత్రాలు అందజేసినట్లు తెలియజేశారు.