ఆళ్లగడ్డ మండలం దిగువ అహోబిలం ఓం నమో నారాయణ టర్నింగ్ వద్ద శనివారం బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. కడప జిల్లా నుంచి ఎగువ అహోబిలం వస్తున్న ఈ వాహనం మలుపు వద్ద అదుపు కోల్పోవడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.