Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 23, 2025
భూపాలపల్ల జిల్లా కేంద్రంలోని సెమి రెసిడెన్షియల్ పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య గొడవ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు,ఈ నేపథ్యంలో పాఠశాల చెందిన ఉపాధ్యాయుడు నిన్న తాగునీటిలో మోనోమందు కలపడంతో విద్యార్థులు అస్వస్థకు గురైన సంఘటన చోటుచేసుకుంది.శనివారం ఉదయం ఎమ్మెల్యే గండ్రపాఠశాలను సందర్శించిన నేపథ్యంలో విద్యార్థులు మందు బాటిల్ ఎమ్మెల్యేకు చూపించి ఆవేదన వ్యక్తం చేశారు,మోనో మందు నీటిలో కలిపి తమ దుప్పట్లపై ఉపాధ్యాయుడు చల్లారని ఎవరికీ అనుమానం రాకుండా అతను కూడా ఆస్పత్రిలో చేరాడని, ఎమ్మెల్యేకు తెలిపారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.