అద్దంకి రూరల్ పరిధిలో ఎవరైనా డీలర్లు నకిలీ ఎరువులు పురుగుమందులు అమ్మితే కట్టండి చర్యలు తీసుకుంటామని సిఐ మల్లికార్జునరావు బుధవారం హెచ్చరించారు. రైతులకు తప్పనిసరిగా ఎరువులు అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. ఎరువులను నిలువవుంచి బ్లాక్ లలో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ మల్లికార్జునరావు తెలియజేశారు. ఎరువుల దుకాణాలపై నిరంతరం తమ పర్యవేక్షణ ఉంటుందని ఆయన చెప్పారు.