Parvathipuram, Parvathipuram Manyam | Aug 25, 2025
తమకు రావలసిన బకాయి జీతాలు చెల్లించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటిఏ నాయకులు గొర్లి వెంకటరమణ, వై.మన్మధరావు, ఇందిరా తదితరులు మాట్లాడుతూ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు 4 నెలల బకాయి జీతాలు చెల్లించాలని. ఆశలుగా పరిగణించాలన్నారు. యూనిఫామ్ ఇవ్వాలన్నారు. సంక్షేమ పథకాలు వర్తింప చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందజేశారు.