'శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని వైసీపీ కార్యాలయంలో 'అన్నదాత పోరు' పోస్టర్లను జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ నాయకులతో కలిసి విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులు ఎరువులు లేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రసాయనిక ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలడంతో డిమాండ్ ఏర్పడిందని పేర్కొన్నారు. అన్నదాతలకు అండగా ఈనెల 9న నిర్వహించే పోరుబాటలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.