హయత్ నగర్ డివిజన్ పరిధిలోని బంజారా కాలనీలో ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి అధికారులతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీవాసులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులు మాట్లాడుతూ కాలనీ పక్కనే ఉన్న స్మశాన వాటికలో వర్షం నీరు నిలువ కావడంతో ఆ నీరు రోడ్లపై ప్రవహించి ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి కొత్త డ్రైన్లు మంజూరయ్యాయని త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.