సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ చేపట్టిన సత్యాగ్రహ నిరవధిక దీక్షకు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మద్దతు తెలిపారు. జీవో నం.49ని రద్దు చేసి పోడు భూముల సమస్యను పరిష్కరించాలని హరీశ్ డిమాండ్ చేశారు. ఈ దీక్షకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి సంఘీభావం తెలిపారు. సమస్యను పరిష్కరించాలని వారంతా కోరారు.