రాష్ట్ర బిజెపి శాఖ పిలుపుమేరకు నేడు సోమవారం బిజెపి మండల అధ్యక్షులు మల్లేష్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు దోమ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు గుంతల మయమైన రోడ్లను బాగు చేయాలని దోమ మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో అధికారులకు భాజపా నాయకుల వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల బిజెపి అధ్యక్షులు మల్లేష్ మాట్లాడుతూ.. దోమ మండల పరిధిలోని మోత్కూరు, మల్లేపల్లి, దిర్సంపల్లి ఐనాపూర్ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా కావడంతో నిత్యం ఆ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అనేకమంది వాహనదారులు కిందపడి గాయాలపాలు కావడం జరిగింద