ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని వినాయక విగ్రహానికి టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత వినాయక చవితి పండగ నుంచి విగ్రహాలకు ప్రతిరోజు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తున్న విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో తొమ్మిదవ రోజు వినాయక స్వామి నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక పూజలో ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ గణేశుని ప్రార్ధించినట్లు ఎరిక్షన్ బాబు అన్నారు.