కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి త్యాగాలు తప్పవని జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ కుమార్ శెట్కార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో దివంగత ఎమ్మెల్యే పట్లోళ్ల కృష్ణారెడ్డి వర్ధంతి సభలో సోమవారం ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యకర్తలు ఐక్యమత్యంగా ఉండి నారాయణఖేడ్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% విజయం సాధించాలని ఆకాంక్షించారు. దివంగత నేతలు అప్పారావు సెట్కార్, శివరావు శెట్కార్ , కిష్టారెడ్డి చూపిన బాటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడవాలని తెలిపారు.