ప్రపంచ దేశాలకే దిక్సూచి అయిన భారత ప్రధాని నరేంద్ర మోడీ తల్లి పట్ల ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అనుచితంగా మాట్లాడటం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ మండలి సభ్యుడు మానేపల్లి అయ్యాజీ వేమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన రాజోలులో సోమవారం మీడియాతో మాట్లాడారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా రాహుల్ మాట్లాడారన్నారు. మోడీ తల్లిని కించపరచడంతే దేశ ప్రజలను కించపరచడం ఆయన అభివర్ణించారు.