నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, జాతీయ జెండా ఆవిష్కరించారు. రైతు వేదిక వద్ద వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి,తాహసిల్దార్ కార్యాలయం, గ్రామపంచాయతీ వద్ద తాహసిల్దార్ సురేష్ కుమార్, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో రాజిరెడ్డి, సొసైటీ కార్యాలయం వద్ద సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, వెటర్నరీ దవాఖాన వద్ద డాక్టర్ మౌనిక, విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం వద్ద విద్యుత్ ఏఈ గణేష్, కాంగ్రెస్ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షులు నసిరుద్దీన్, ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు.