కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ధనలక్ష్మి జువెలరీ షాపులో దొంగలు పడ్డారు. గురువారం అర్ధరాత్రి షెటర్ తాళాలు పగలగొట్టి, బంగారు పూత పూసిన ఆభరణాలను దోచుకెళ్లారు. శుక్రవారం షాప్ యాజమాని ఫిర్యాదుతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం తో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. బాలానగర్ ఏసిపి యాజమానిని వివరాల అడిగి తెలుసుకున్నారు.