రేషన్ కమిషన్ చెల్లించాలని తహశీల్దార్ వినతిపత్రం అందజేత మెదక్ జిల్లా తూప్రాన్ తహశీల్దార్ కార్యాలయం ముందు రేషన్ డీలర్లు సోమవారం ఉదయం ఆందోళన చేపట్టారు. రేషన్ డీలర్లకు గత ఐదు నెలలుగా కమిషన్ లు చెల్లింపు చేయకపోవడంతో ఆందోళన చేపట్టి తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ప్రభుత్వం పేర్కొన్నట్లుగా రూ.5 వేల కమిషన్, క్వింటాలు రూ.300 అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పట్టాభి శ్రీనివాస్, కార్యదర్శి స్వామిగౌడ్, ట్రెజరర్ చంద్రం, వెంకట నరసయ్య, షఫీ పాల్గొన్నారు.