భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడి కూటమి అభ్యర్థికి ఓటు వేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ డీకే విశ్వేశ్వర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. బుధవారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగు ఎంపీలంతా సుదర్శన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు