Parvathipuram, Parvathipuram Manyam | Aug 24, 2025
గొర్రెలు, మేకల పెంపకం దారుల సమస్యలు పరిష్కరించాలని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రండి అచ్యుతరావు డిమాండ్ చేశారు. ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఆయన సంఘం నాయకులు నారాయణరావు, సింహాచలం తో కలిసి మాట్లాడారు. మూగజీవాలు మేతకోసం కొండలపైకి వెళ్లేందుకు దారులు లేవన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ప్రమాదాలు, పాముకాటు సంభవిస్తే పెంపకందారులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చెరువు గట్లను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నట్టల నివారణ మందులను ఏడాదికి నాలుగు సార్లు వేయాలని డిమాండ్ చేశారు.