గుత్తి పట్టణంలోని అమృత సినిమా థియేటర్ ఏరియాలో సోమవారం రాత్రి బైక్ విషయంలో ఇద్దరు యువకుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరు పరస్పరం కొట్టుకున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏఎస్ఐ నాగ మాణిక్యం, పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.