మహిళలు, బాలల రక్షణలో ప్రభుత్వ చట్టాలు కీలకమని, బాలికల విద్య, భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె. లలితా కుమారి అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం పిసిపీఎన్డీటీ చట్టం, పాక్సో చట్టం, గృహ హింస చట్టం, పోష్ చట్టం బాల్య వివాహ నిషేధ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, బాలల రక్షణలో ప్రభుత్వ చట్టాలు కీలకమని, బాలికల విద్య, భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని,PCPNDT చట్టం ప్రకారం లింగ నిర్ధారణ నిషేధమని, దానిని అరికట్టడంలో అందరూ కట్టుబడి ఉండాలన్నారు.