పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్‌ను ఉండి నియోజకవర్గం పెదమిరంకు తరలించే ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. దీనికి అనుగుణంగా పెదమిరంలో కలెక్టరేట్ కోసం కేటాయించిన మూడు ఎకరాల ప్రభుత్వ భూమిలో పనులు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 11 గంటలకు జెసిబీల సాయంతో స్థలాన్ని శుభ్రపరచి, చదును చేసే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే భూమి సిద్దం చేయడం ప్రారంభించడంతో, కలెక్టరేట్ తరలింపు అంశం జిల్లాలో మరింత చర్చనీయాంశంగా మారింది.