చీని పంటకు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారని పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ధ్రువ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాజ్యసభ మాజీ సభ్యులు తులసి రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి వేంపల్లి మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామంలో చీని పంట రైతులను కలిసి వారి కష్టాలను తెలుసుకున్నారు. చీనీ పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ప్రభుత్వం పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు. దళారుల దందాలను కూడా అరికట్టాలని చెప్పారు.