ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు అట్టహాసంగా జరిగాయి. ఆలయ అనివేటి మండపంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. వేదికపై కొలువుదీరిన వరలక్ష్మి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు.