DSC అభ్యర్థులు ఫేక్ సర్టిఫికెట్లు సమర్పిస్తే కేసులే: DEO DSC అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలలో ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తే కేసులు నమోదు చేస్తామని డీఈవో వరలక్ష్మీ హెచ్చరించారు. సర్టిఫికెట్ల పరిశీలనకు నగరంలో రెండు కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకపోయినా, పరిశీలనకు గైర్హాజరైన ఉద్యోగం లేనట్లేనని తెలిపారు. క్రీడా కోటా కింద అభ్యర్థుల సర్టిఫికెట్లను రాష్ట్ర విద్యాశాఖ అధికారుల సమక్షంలో పరిశీలిస్తామన్నారు.