Parvathipuram, Parvathipuram Manyam | Aug 24, 2025
కార్మిక ఉద్యమ నేత సురవరం సుధాకర్ రెడ్డి మరణం సిపిఐ పార్టీకి తీరని లోటనీ సిపిఐ పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి కోరంగి.మన్మధరావు అన్నారు.ఆదివారం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ కుమార్, ఈవీ నాయుడు తో కలసి సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి 1942లో మహబూబ్ నగర్ జిల్లాలో ఈశ్వరమ్మ, వెంకటరామిరెడ్డిలకు జన్మించారన్నారు. వ్యవసాయదారుడుగా పాత్రికేయుడుగా,కార్మిక నాయకుడిగా ఎన్నో సేవలు అందించారన్నారు.నల్గొండ పార్లమెంట్ నుంచి రెండు సార్లు పార్లమెంట్ నుంచి గెలుపొందారన్నారు.