ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధురాలి మృతి.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మక్త గ్రామంలో ఆదివారం ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఒక వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కల్వల రాజమ్మ రోడ్డు దాటుతుండగా కన్నాపూర్ వైపు వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న బ్లూకోట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.