రంపచోడవరం నియోజవర్గం ఎటపాక మండలంలో గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకొని మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది మండలంలోని బాసవాగు గ్రామం సమీపంలో బ్రిడ్జి దగ్గర ఒక వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు గ్రామస్తులు శుక్రవారం మధ్యాహ్నం 1:00 సమయంలో గుర్తించారు. ఈ మేరకు ఎటపాక పోలీసులకు సమాచారం అందడంతో ఎటపాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ నిర్వహిస్తున్నారు