గత 25 సంవత్సరాలు క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా చలో అసెంబ్లీ చేపట్టి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. అప్పుడు చంద్రబాబు పోలీసులతో కాల్పులు చేపించారని చెప్పారు. పోలీసుల కాలుపుల్లో ముగ్గురు మరణించగా, వేలాదిమంది కామ్రేడ్స్ పోలీసుల లాఠీ దెబ్బలకు క్షతగాత్రులయ్యారు అయ్యారని అన్నారు. బషీరాబాద్ విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా గురువారం మధ్యాహ్నం నగరంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ సెంటర్ వద్ద ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.