గుంతకల్ పట్టణంలోని చైతన్య సినిమా థియేటర్ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వివాదాస్పదంగా మారింది. వినాయక విగ్రహాన్ని అవమానపరిచే విధంగా ఏర్పాటు చేశారని భారతీయ జనతా పార్టీ నాయకులు గురువారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. సమాచారం తెలియడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. విగ్రహం ఏర్పాటు చేసిన వారికి, బీజేపీ నాయకులకు పోలీసులు సర్ది చెప్పారు. వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.