Download Now Banner

This browser does not support the video element.

రాయదుర్గం: ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన బ్రహ్మసముద్రం గ్రామానికి చెందిన ఓ యువకున్ని కాపాడిన పోలీసులు

Rayadurg, Anantapur | Sep 2, 2025
ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన ఓ యువకున్ని పోలీసులు కాపాడారు. వివరాల్లోకి వెళితే కణేకల్లు మండలంలోని బ్రహ్మసముద్రం గ్రామంలో తల్లిదండ్రులు మందలించారని ఓ యువకుడు మంగళవారం మద్యాహ్నం ఇంటినుండి వెళ్లిపోయాడు. ఆత్మహత్య చేసుకుంటానంటూ తల్లిదండ్రులకు మెసేజ్ లు చేశాడు. ఆందోళన గురైన తల్లిదండ్రులు కణేకల్లు పోలీసులను ఆశ్రయించారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఆ యువకుడి ఆచూకీ కనుగొన్నారు. గుమ్మగట్ట పోలీసులు ఆ లొకేషన్ కు వెళ్లి మద్యం సేవిస్తూ కనిపించిన ఆ యువకుడిని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us