జిల్లా గూడ్స్, సర్వీస్ టాక్స్ జిల్లా ఇంటిలిజెన్స్ విభాగం డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో ఆంధ్రస్ లార్జెస్ట్ రెస్టారెంట్ హోటల్ నందు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మీడియాకు ఎటువంటి సమాచారం తెలపకుండా ఉడాయించడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని మల్లేపల్లి శివారును గల రాయుడు గారి మిలటరీ హోటల్లో (ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్) అధికారులు సుమారు ఉదయం 11.45 నుంచి తనిఖీలు ప్రారంభించారు.