తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఏకగ్రీవంగా ఆమోదించడంపై మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ఎలిఫెంటా చౌరస్తా వద్ద మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. అనంతరం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.