వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా అటవీ శాఖ, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో స్వామి వివేకానంద మినీ స్టేడియంలో జిల్లా అటవీ శాఖ అధికారి రవి ప్రసాద్ మరియు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి రఘువరన్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ...ఈ సంవత్సరం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణం లోని స్వామి వివేకానంద మినీ స్టేడియంతో పాటు కోరుట్ల, మెట్ పల్లి మరియు రాయికల్ పట్టణాలలో ఉన్న మినీ స్టేడియంలలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం