వైసీపీ సోషల్ మీడియాకి టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని వార్నింగ్ ఇచ్చారు. మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, వైసీపీ కార్యకర్తలు తీరు మార్చుకోకపోతే నాలుక చీరేస్తా అంటూ శనివారం గురజాల నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో యరపతినేని మాట్లాడారు. జగన్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడంతోనే ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని కూటమి అధికారంలో ఉంటేనే ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు.