.కాకినాడలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ ఆధ్వర్యంలో ఓబిసి భారీ సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ రాష్ట్ర చైర్మన్ శోంటి నాగరాజు తెలిపారు.జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ విచ్చేసిన ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఓబీసీ నూతన కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.అలాగే జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లోని నియోజకవర్గ చైర్మన్ ,వైస్ చైర్మన్లు నియమించడం జరిగిందన్నారు.పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి నేతృత్వంలో అన్ని విభాగాలకు కమిటీలను వేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడ