శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడలోని తోలేటి పల్లి, పాత బత్తులపల్లి, యనుములవారిపల్లి మీదుగా కదిరికి వెళ్లే రోడ్డు మరమ్మతులకు నోచుకోకపోవడంతో శిథిలమైంది. ఈ రోడ్డుపై ఎదురెదురుగా వచ్చే వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని శుక్రవారం మధ్యాహ్నం వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గోతుల మయంగా మారిన, కంకర తేలిన రోడ్డుపై రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించాలని వాహనదారులు కోరారు.