విజయవాడ కృష్ణా నదిలో మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు సమయంలో పుష్కర్ ఘాటు వద్ద గుర్తు తెలియని మహిళ ఆత్మహత్యప్రయత్నించింది. పక్కనే ఉన్న గజతగాళ్లు మహిళలు రక్షించారు. సదరు మహిళ విజయవాడ భవానిపురం ప్రాంతానికి చెందిన మహిళగా గుర్తించారు. భవానిపురం పోలీసులు మహిళకు సంబంధించిన కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.