డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులను ఆలూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా సన్మానించారు. ఆలూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం శనివారం మధ్యాహ్నం 3: 05 మండల విద్యాశాఖ అధికారి నరేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయుల సేవలను గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.