కాకినాడ రూరల్ కి చెందిన సత్యభూషణం అనే వ్యక్తి ఈనెల 5వ తేదీన సెల్ఫీ వీడియో విడుదల చేసాడు. తన భార్యతో పంపన బుజ్జి అనే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతోందని ఆ వీడియోలో పేర్కొన్నాడు. తాను నాలుగు రోజుల క్రితం రాజా ట్యాంక్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది అన్నారు. గతంలో కూడా తాను తన భార్యను పలు దఫాలు హెచ్చరించడం జరిగింది అని తెలిపారు.