Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 23, 2025
రాజవొమ్మంగి మండల వ్యాప్తంగా ఇంత వరకు 4 వేల ఎకరాల్లో వరి ఊడ్పులు పూర్తైనట్లు మండల వ్యవసాయాధికారి చక్రధర్ శనివారం మధ్యాహ్నం అన్నారు. మండలంలో 6,234 ఎకరాల్లో వరి సాగవుతుండగా, వర్షభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది నాట్లు ఆలస్యంగా పడుతున్నాయన్నారు. ఇటీవల రైతుల అవసర మేరకు వర్షాలు కురిశాయన్నారు. దీంతో ప్రస్తుతం ఇంకా పొలాలలో దమ్ములు జరుగుతున్నాయన్నారు. ఈ నెలాఖరుకు నాట్లు పూర్తి చేసుకోవాలని రైతులకు సూచించారు.