రాజమండ్రి ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసీయూ) ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు.మంగళవారం బొమ్మూరు కలెక్టరేట్‌లో జిజిహెచ్ అధికారులతో సమావేశమై కొత్త విభాగాల ఏర్పాటు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుద్ధ్యం పరిరక్షణ వంటి అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాసుపత్రి నిర్వహణకు అవసరమైన సూచనలు ఇచ్చారు