కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా టికెయర్ స్కూల్ వద్ద వినాయక చవితి సందర్బంగా నిర్వహించిన వినాయకుని లడ్డూను వేలం పాటలో వైసీపీ నాయకుడు హృషికేశవ రెడ్డి దక్కించుకున్నారు. నేడు బుధవారం వైసిపి నాయకులు గణనాథుని లడ్డూను తాడేపల్లిలో మాజీ సీఎం వైయస్ జగన్కు అందజేశారు. ఈ సందర్భంగా హృషికేశవ రెడ్డి మాట్లాడుతూ జగన్ పేరుతో ఈ వేలం పాటలో పాల్గొన్నానని, వేలం పాటలో స్వామి వారి లడ్డూను దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు వైసీపీ నేతలు జగన్ ను కలిశారు.