ఏలూరు జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ఏఆర్డీఎస్పీ చంద్రశేఖర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తన దైనందిన జీవితంలో సైక్లింగ్ను భాగంగా చేసుకోవాలన్నారు. పోలీస్ సిబ్బంది మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరన్నారు.