శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 214.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు కలెక్టర్ కార్యాలయం నుంచి గురువారం మధ్యాహ్నం ఒక ప్రకటన వెలువడింది. అత్యధికంగా గోరంట్ల మండలంలో 36.2 మి.మీ, నల్లమాడ 28.4, కదిరి, హిందూపురం, 14.2, రోళ్ల 11.4, ముదిగుబ్బ మండలంలో 10.6 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాలలో మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలో 32 మండలాలకు గాను 8 మండలాలు మినహా మిగిలిన మండలాలలో వర్షం కురిసింది.