సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లోక కళ్యాణార్థం మహిళలు సంపూర్ణ భగవద్గీత పారాయణం నిర్వహించారు. పట్టణంలోని రాచన్నపేట్ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో బుధవారం గీత జ్ఞాన వాహిని మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు.