కరీంనగర్ జిల్లాలో 'మెటా ఫండ్' అనే నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ కంపెనీ పేరుతో ప్రజలను మోసగించిన కేసులో నలుగురు నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన వరాల లోకేశ్వర్ రావు అనే వ్యక్తి మెటా ఫండ్ పేరుతో ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో డబ్బులు పెడితే మూడు రెట్లు లాభం వస్తుందని ప్రజలను నమ్మబలికాడు. అతడితో చేతులు కలిపి కరీంనగర్‌కు చెందిన బూర శ్రీధర్, తులసి ప్రకాష్, దాసరి రమేష్, దాసరి రాజు ఈ మోసంలో భాగస్వాములయ్యారు. వీరంతా కలిసి 8 మంది బాధితుల నుండి సుమారు 54,65,000/- వసూలు చేశారు.