పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి ప్రహ్లాదపురం కు చెందిన హరిత(27) మానసికంగా బాధపడుతూ ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త బీరదా శ్రీను మద్యానికి బానిసగా మారిన తర్వాత తరచుగా మద్యం తాగడం వల్ల ఆమె బాధపడుతూ, ఎవరూ లేని సమయంలో ఇంట్లో తలుపు వేసుకుని, ఫ్యాన్‌కు చున్నితో ఉరి వేసుకుని మరణించింది. సోమవారం సమాచారం తెలుసు కున్న పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకి కేజీహెచ్ కీ తరలించారు