సోమవారం నగరపాలక కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నగరపాలక పరిధిలోని పలువురు తమ సమస్యలపై వినతులు సమర్పించగా.. సదరు సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. అర్జీలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి సమస్యలు పరిష్కరించాలని, పరిష్కరించిన సమస్యలపై సకాలంలో నివేదికలు సమర్పించాలన్నారు. సోమవారం నాటి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఇంజనీరింగ్ 4, రెవెన్యూ 4, పబ్లిక్ హెల్త్-1, పింఛను -1 ఒక్కొక్కటి చొప్పున మొత్తం 10 వినతులు అందాయి. కార్యక్రమంలో ఎ