మక్తల్ సర్కిల్ పరిధిలో చాలా కాలంగా కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారం కోసం కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని మక్తల్ సీఐ రామ్ లాల్ గురువారం నాలుగు గంటల సమయంలో ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13 వ తేదీన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నారాయణపేట కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించ బడుతుందని ఈ యొక్క లోక్ అదాలత్ ను కక్షి దారులు సద్వినియోగం చేసుకోగలరని కోరారు.