గణేష్ నిమజ్జనం సందర్భంగా మండపాల నిర్వాహకులు డీజేలను వాడరాదని భారీ శబ్దాలు వస్తున్నందున వాటిని నిషేధించడం జరిగిందని వర్ని ఎస్సై మహేష్ సూచించారు. గురువారం రెండు గంటలకు మోస్రా మండల కేంద్రంలో మండలంలోని గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. డీజే లు వాడితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, రాత్రి 10 గంటల లోపు నిమజ్జనాన్ని పూర్తి చేయాలని సూచించారు. మండల కేంద్రంలోని గణేష్ నిమజ్జనం చేసే చెరువును తాసిల్దార్ రాజశేఖర్ గురువారం పరిశీలించారు. నిమజ్జనం చేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యుత్తును సమకూర్చడంతో పాటు గజ ఈతగాళ్ళ ను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు