ఆదివారం అర్ధరాత్రి వనపర్తి జిల్లా బుద్ధారం సాంఘిక గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఎలుకలు కొరికిన సంఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం పాఠశాలలో ఆర్ బి ఎస్ కె వాళ్లకు చూపించిన పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థుల పరిస్థితి విషమంగా అవుతుందని ఉద్దేశంతో గోపాల్పేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్సను అందించారు. ప్రభుత్వ సంక్షేమ పాఠశాలల్లో ఎలుకలు విద్యార్థులను కొరకడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ టిటి ఇంజక్షన్ ఇచ్చి వైద్యం చేసినట్లు తెలియజేశారు.